ఈటల, రాజగోపాల్ రెడ్డి మనసు కాంగ్రెస్ చుట్టే తిరుగుతోంది – రేణుక చౌదరి

-

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనసు మొత్తం కాంగ్రెస్ పార్టీ చుట్టే తిరుగుతూ ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేణుకా చౌదరి. కాసేపటి క్రితమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో భేటీ అయిన రేణుక చౌదరి.. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తాను సమావేశం అయ్యానని… ఇది చాలా క్యాజువల్ మీటింగ్ అని ఆమె తెలిపారు. పొంగులేటి ఎలాంటి డిమాండ్లు చేయలేదని… ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని రేణుక చౌదరి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చిన ఆహ్వానిస్తామని రేణుక చౌదరి తెలిపారు. ఈటెల రాజేందర్ చాలా మంచి వ్యక్తి అని… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ వ్యక్తేనని ఆమె తెలిపారు. బిజెపి పార్టీలో కూడా కోవర్ట్లుఉన్నారని… ఎంపీ పువ్వాడ అజయ్ దుర్మార్గుడని ఫైర్ అయ్యారు రేణుక చౌదరి.

Read more RELATED
Recommended to you

Latest news