తెలంగాణ రైతులకు శుభవార్త. తొలిరోజు 22,55,081 మంది రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్ల రైతుబంధు నిధులు జమ చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు కీలక ప్రకటన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కాళేశ్వరం నిర్మాణం మూలంగా అందుబాటులోకి వచ్చిన సాగునీటితో సాగు పెరిగి అత్యధిక వరిధాన్యం ఉత్పత్తి సాధ్యమయిందని తెలిపారు.
బియ్యం సరఫరాపై కేంద్రం చేతులు ఎత్తేస్తే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని తెలపారు. తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయని.. ముఖ్యమంత్రి కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నదని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను కొనసాగిస్తున్నారని.. ఖర్చు ఎంతయినా సరే రైతు నష్టపోకూడదన్నది కేసీఆర్ ఆలోచన అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.