సీడబ్ల్యూసీలో చేరేందుకు కాంగ్రెస్ నేతల ఆరాటం

-

తెలంగాణలో పాటు వివిధ రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీ కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రాల నుంచి ఏఐసీసీ దీని కోసం  ప్రతిపాదనలకు స్వీకరిస్తోంది. సీడబ్ల్యూసీలో స్థానం సంపాదించేందుకు రాష్ట్రంలోని అగ్ర నేతలు పావులు కదుపుతున్నారు. ఎలాగైనా కమిటీలో చేరాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.

రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చురుగ్గా పాల్గొన్నారు. ఈమె తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోటరికి చెందిన వారే. కాబట్టి సీతక్క సీడబ్య్లూసీలో  చేరడం లాంఛనమే. సీనియర్లు అయినా జానారెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, మధు యాష్కీ, హనుమంత రావు, రేణుక చౌదరి, భట్టి విక్రమార్క లాంటి వారు ప్రస్తుతం రేవంత్ రెడ్డికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సీడబ్ల్యూసీ కమిటీలో ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్య నేతలంతా ఈ కమిటీలో స్థానం సంపాదించాలని తెగ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల లోపు ఈ కొత్త కమిటీని నియమించాలని కాంగ్రెస్ భావిస్తోంది. తమ పలుకుబడిని ఉపయోగించి ఈ కమిటీలో చేరేందుకు కొంతమంది నేతలు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు.

ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సీడబ్ల్యూసీ కమిటీ లో స్థానం కల్పించాలని ఏఐసీసీ అగ్ర నేతలను కోరినట్లు సమాచారం.  కాంగ్రెస్ పార్టీలో సీడబ్ల్యూసీ కమిటీలో గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉన్న వారికే ఇప్పటి వరకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.

కానీ కాంగ్రెస్ సీనియర్లు పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి కమిటీలో స్థానం కల్పించాలని హై కమాండ్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ కమిటీలో చేరడం కోసమైనా రేవంత్ రెడ్డితో సన్నిహితంగా మెలగాలని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సీడబ్ల్యూసీలో ఎవరికి స్థానం దక్కుతుందో.. కమిటీలో చోటు దక్కని వారిని ఎలా సద్దుమణిగిపిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news