ఇలా చేస్తే.. మీ పాప పెళ్లి వయసుకి చేతికి రూ. 64 లక్షలు వస్తాయి..!

-

చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా మంచి స్కీమ్ లో డబ్బులని పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం సుకన్య సమృద్ధి యోజన లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. నెలకు కొంత చొప్పున డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి మంచిగా రిటర్న్స్ వస్తుంటాయి. ప్రస్తుత త్రైమాసికానికి 8 శాతంగా వుంది వడ్డీ. ఆడపిల్ల పెళ్లి కోసం లేదా చదువు కోసం తల్లిదండ్రులు పాప పుట్టిన వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఆమె పెళ్లి వయసు కి చేతికి లక్షల్లో రాబట్టుకోవచ్చు.

15 సంవత్సరాలు కట్టాలి. మెచ్యూరిటీ పీరియడ్ 21 సంవత్సరాలు. 21 ఏళ్ల తర్వాత మీకు డబ్బులు వచ్చేస్తాయి. పోస్టాఫీస్ లేదా సమీపంలో ఉన్న బ్యాంకుల్లో మీరు ఈ అకౌంట్ ని ఓపెన్ చేయవచ్చు. కనీసం రూ.250 వరకు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు.

గరిష్టంగా ఏడాదికి రూ.1,50,000 కట్టొచ్చు. అంటే నెలకు రూ.12,500 చొప్పున పే చెయ్యాలి. మొత్తం 12 ఇన్‌స్టాల్‌మెంట్లలో కట్టొచ్చు లేకపోతే ఒకేసారి కట్టుకోవచ్చు. పాప పుట్టిన వెంటనే ఏడాదికి రూ.1.50 లక్షలు పెడితే పాప 21 ఏళ్ల సమయంలో మొత్తం డబ్బులు వస్తాయి. 7.6 శాతం వడ్డీ రేటు చొప్పున లెక్కిస్తే అప్పుడు చేతికి రూ.64 లక్షలు ని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news