‘నా నంబర్ వాడలేకపోతున్నాను’.. డ్రగ్స్ కేసుపై మరోసారి అషూరెడ్డి స్పందన

-

కబాలి తెలుగు సినిమా నిర్మాత డ్రగ్స్ సరఫరా చేస్తు పట్టుబడిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కేపీ చౌదరి కాల్ లిస్టు.. బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన అధికారులకు ఆ జాబితాలో పలువురు సినీ సెలబ్రిటీల పేర్లు కనిపించాయి. అందులో ఒకరే సినీ నటి అషూ రెడ్డి. డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన నిర్మాత కేపీ చౌదరి వ్యవహారంలో తన పేరు బయటకి రావడంపై నటి అషూ రెడ్డి మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

‘‘కొన్ని మీడియా ఛానల్స్​ నన్ను కించపరిచే విధంగా వార్తలు రాశాయి. నా పేరు, ఫోన్‌ నంబర్‌ టెలికాస్ట్‌ చేశాయి. మొబైల్‌ నంబర్‌ను టెలికాస్ట్ చేయడం వల్ల నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. దీనివల్ల ఆ నంబర్‌ను నేను ఉపయోగించలేకపోతున్నాను. కేపీ చౌదరితో గంటల తరబడి ఫోన్‌ మాట్లాడానని చెబుతున్నారు. అతడితో నాకున్న పరిచయం, ఫోన్‌ కాల్స్‌పై నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇది జరిగినప్పుడు నేను వేరే దేశంలో ఉన్నాను. సంబంధం లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నందునే నేను వీడియో పోస్ట్‌ చేయకుండా ఉండలేకపోయాను’’ అని అషురెడ్డి వీడియోలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news