కారుకు కమ్యూనిస్టుల సెగలు..ఎం‌ఐ‌ఎంతో చిక్కులు.!

-

ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్న కేసీఆర్‌కు..ఈ సారి రాజకీయ పరిణామాలు అంతగా అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ అని, ఆంధ్రా పార్టీలు అంటూ బూచిగా చూపించి గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు అవేం చెప్పడానికి లేదు. ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పిని టార్గెట్ చేసి..ప్రధానమైన కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టాలని చూశారు గాని..అది పెద్దగా వర్కౌట్ కాలేదు.

కాంగ్రెస్ రేసులోకి వచ్చేసింది..పైగా తెలంగాణ ఇచ్చిన పార్టీ తమది అని, రెండుసార్లు బి‌ఆర్‌ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి..ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతుంది. దీంతో ప్రజలు కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. దీంతో కే‌సి‌ఆర్‌కు కాస్త ఇబ్బందికర పరిస్తితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో బి‌ఆర్‌ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలకు ప్రజా వ్యతిరేకత ఉండటం మైనస్ గా మారింది. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని కే‌సి‌ఆర్ చెబుతున్నారు..దీంతో వారేమో కాంగ్రెస్ లోకి జంప్ అవ్వాలని చూస్తున్నారు.

TRS-MIM

ఇలా రకరకాల పరిణామాలు బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఇదే సమయంలో మిత్రపక్షాలు సైతం యాంటీగా మారుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో ఎం‌ఐ‌ఎం పార్టీ బి‌ఆర్‌ఎస్‌కు మద్ధతుగా ఉంటూ వస్తుంది. పాతబస్తీలో తాము పోటీ చేసే 7 సీట్లు మినహా మిగిలిన సీట్లలో ముస్లిం ఓట్లు బి‌ఆర్‌ఎస్‌కు పడేలా చేస్తున్నారు. కానీ ఈ సారి ఎం‌ఐ‌ఎం తమకు పట్టున్న అన్నీ స్థానాల్లో పోటీ చేస్తామని అసదుద్దీన్ చెబుతున్నారు. అలా చేస్తే ఓట్లు చీలిపోయి బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది.

ఇక మునుగోడు ఉపఎన్నికలో బి‌ఆర్‌ఎస్ గెలుపుకు సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలు పనిచేశాయి. అలాగే రానున్న ఎన్నికల్లో కూడా బి‌ఆర్‌ఎస్ తో పొత్తు కొనసాగించాలని అనుకున్నాయి. కానీ కే‌సి‌ఆర్ సరిగ్గా పట్టించుకోకపోవడం..బి‌ఆర్‌ఎస్ తో పొత్తు ఉంటే కమ్యూనిస్టులకు ఎక్కువ సీట్లు వచ్చేలా లేవు. ఇదే సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ తో కమ్యూనిస్టులు పనిచేస్తున్నారు. దీంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ తో కలిసి ముందుకెళ్లాలని కమ్యూనిస్టులు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ లాంటి చోట్ల బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news