పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పీవీ జ్ఞాన భూమి వద్ద నివాళులు అర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణలోని మారుమూల ప్రాంతంలో పుట్టిన పీవీ అంచెలంచెలుగా ఎదిగారని… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా పని చేశారన్నారు.
పీవీ నరసింహారావు తెలుగు సంప్రదాయంలో టివిగా కనిపించేవారని… దేశంలో ఇప్పుడు అనేక డ్రామాలు నడుస్తున్నాయని ఆగ్రహించారు. పీవీ ఆర్థిక సంస్కరణలు తీసుకురాకపోతే దేశం ఏమీ అయ్యేది అందరికీ తెలుసు అని.. కేంద్ర ప్రభుత్వం పీవీకీ భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీవీకీ భారత రత్న ఇవ్వడం వల్ల దేశ ప్రతిష్ట, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందని చెప్పారు. పీవీకీ భారత రత్నపై పోరాడుతాం.. పార్లమెంట్ లో గళమెత్తుతామని.. పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచిపోతారన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్.