తెలుగు క్రికెటర్ హనుమ విహారి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్ర టీంకు గుడ్ బై చెప్పాడు తెలుగు క్రికెటర్ హనుమ విహారి. రాబోయే దేశవాళీ సీజన్లో ఆంధ్రకు కాకుండా మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాలని హనుమ విహారి నిర్ణయం తీసుకున్నాడు.
విహారితో పాటు మధ్యప్రదేశ్ తరఫున ఆడనున్నాడు ఢిల్లీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ కుల్వంత్ ఖేజ్రోలియా. ఇక జూన్ 28న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు తెలుగు క్రికెటర్ హనుమ విహారి. అయితే.. దీనిపై తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కాగా, తెలుగు క్రికెటర్ హనుమ విహారిని ఐపీఎల్ లో ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదన్న సంగతి తెలిసిందే.