పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర బహిరంగ సభ జరుగనుంది. ఈ మేరకు భీమ వరం అంబేడ్కర్ సెంటర్ వద్ద బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర బహిరంగ సభ కు 50 వేలకు పైగా హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు.
ఈ సందర్భంగా భీమవరం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక అటు భీమవరం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని కోరుతున్నాయి అభిమానులు, పార్టీ శ్రేణులు. ఇలాంటి తరుణంలోనే.. ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం పై ఇప్పటికే ఆశక్తి నెలకొంది.