వైసీపీ – టీడీపీ మ‌ధ్య‌లో ఊగిస‌లాట‌లో అవినాష్ …బెజ‌వాడ‌లో ఏం జ‌రుగుతోంది…!

-

బెజ‌వాడ టీడీపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అనే టెన్ష‌న్‌లో త‌మ్ముళ్లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. అధికారం కోల్పోయి ఐదు మాసాలు పూర్తి కాక‌ముందే.. కీల‌క‌నాయ‌కులు ఎలాంటి ఆలోచ‌న లేకుండా.. ఎలాంటి ప‌ద‌వుల‌కు ఆశ ప‌డ‌కుండా వెళ్లి అధికార పార్టీ వైసీపీలో చేరిపోతున్నారు. దీంతో పార్టీలో నేత‌ల‌ను నిల‌బెట్టుకునేందుకు అధినేత చంద్ర‌బాబు తిప్ప‌లు ప‌డుతున్నారు. ఇదిలావుం టే.. తాజాగా బెజ‌వాడ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఎదుగుతున‌న యువ నేత‌, తెలుగు యువ రాష్ట్ర అధ్య‌క్షుడు దేవినేని అవినాష్‌.. ఇప్పుడు టీడీపీకి బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తు న్నాయి.

టీడీపీలో అవినాష్ చాలా యాక్టివ్‌గా ఉన్న విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌ను యువ‌త‌కు చేరువ చేయ‌డంతోపాటు యువ‌త ఓటు బ్యాంకును టీడీపీకి చేరువ చేయ‌డంలోనూ ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి యువ‌త‌ను ఉత్తేజం చేశారు. ఈ విష‌యంలో ఆయ‌న కృషిని ఏ ఒక్క‌రూ త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే, ఇప్పుడు ఆయ‌నలోనూ అంత‌ర్మ‌థ నం ప్రారంభ‌మైంది. పార్టీలో త‌న మాట‌కు లెక్క లేకుండా పోయింద‌ని, త‌న ఆవేద‌న‌ను ఎవ‌రూ పంచుకో వ‌డం లేద‌ని అవినాష్ ఫీల్ అవుతున్నారు.

దీనికి ప్ర‌త్యేక కార‌ణం ఉంది.. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో అవినాష్ విజ‌య‌వాడ  తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని భావించారు. త‌న తండ్రి దేవినేని నెహ్రూ కాలం నుంచి కూడా ఇక్క‌డ ఈ కుటుం బానికి చెక్కు చెద‌ర‌ని ఓటు బ్యాంకు ఉంది. ఈ నేప‌థ్య‌లో ఇక్క‌డైతే త‌న గెలుపు సాధ్య‌మ‌ని అవినాష్ బా వించారు. అయితే, చంద్ర‌బాబు ఆయ‌న‌ను దూరంగా గుడివాడ వెళ్ల‌మ‌ని ఆదేశించారు. ఈ క్ర‌మంలోనే అవినాష్ గుడివాడ నుంచి పోటీ చేశారు. అయితే, ఇక్క‌డ వైసీపీ నాయ‌కుడు , సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని నుంచి తీవ్ర‌మైన పోటీ ఎదురు కావ‌డంతో అవినాష్‌కు విజ‌యం ద‌క్క‌లేదు.

దీంతో అప్ప‌టి నుంచి అవినాష్. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా తూర్పు నియోజ‌క‌వ‌ర్గం కేటాయించాల‌ని డి మాండ్ చేస్తున్నారు. అయితే, ఈయ‌న డిమాండ్‌పై ఇప్ప‌టి వ‌రుకు టీడీపీలో ఏ ఒక్క‌రూ స్పందించ లేదు. ఇదిలావుంటే, వైసీపీ నుంచి అవినాష్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న పార్టీలోకి వ‌స్తే.. తూర్పు నియోజ‌క‌వ‌ర్గం కేటాయిస్తామ‌ని చెబుతున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డి వైసీపీ నాయ‌కులు య‌ల‌మంచిలి ర‌వి, బొప్ప‌న భ‌వ‌కుమార్‌ల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. దీంతో అవినాష్ ఏ క్ష‌ణ‌మైనా.. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news