గ్రూప్ రాజకీయాలు మనకొద్దు: రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలుపు దక్కించుకోవాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా క్యాడర్ ను రెఢీ చేసుకుంటోంది, దానికి తోడు కాంగ్రెస్ పార్టీలోకి BRS లో కీలక నేతలుగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు లు రానున్నారు. ఖమ్మం లో ఆదివారం జరగనున్న బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ ఏర్పాట్లను టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏర్పాట్ల సమీక్షలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ సభను సక్సెస్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సభ ద్వారా వచ్చే ఎన్నికలలో విజయానికి నాంది పలకాలి ఆశాభావాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా లో పొంగులేటి రాకతో కాంగ్రెస్ కు ఇంకా చాలా బలంగా మారుతుందని… ఇక్కడ 10 కి 10 ఎమ్మెల్యే స్థానాలు మనమే గెలుచుకోవాలని చెప్పారు.

పార్టీలో ఉన్న ఏ ఒక్కరూ కూడా గ్రూప్ రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్ విజయం కోసం కృషి చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news