మరో వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్.. !

-

మరో వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చిక్కుకున్నారు. బీఆర్‌ఎస్‌ బ్యానర్‌ పై తన ఫోటోను వేసుకున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. అయితే.. విషయం నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాజీ IAS అధికారి ఆకునూరి మురళి ఫైర్ అయ్యారు.

‘బాబు శ్రీనివాస్ నువ్వు చాలా చెడ్డ సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావు. ప్రభుత్వ శాఖకు హెడ్ గా ఉండి చెత్త రాజకీయాలు చేసుడు ఏంది? రాజీనామా చేసి నీ ఇష్టం వచ్చినట్లు రాజకీయం చేసుకో. ఎవ్వడి కాళ్ళయినా 100సార్లు పట్టుకో… ఎవ్వడు వద్దనడు. ఇతడిపై CS చర్యలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశాడు.

కాగా, రామాయణంలో రావణాసురుడు ఉన్నట్లు కొత్తగూడెంలో కూడా ఓ రావణాసురుడు ఉన్నాడు అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై నిన్న తీవ్ర అరోపణలు చేశారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు.

Read more RELATED
Recommended to you

Latest news