ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై హైద్రాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ ను సందర్శించి అక్కడి ఏర్పాట్లు సరిగా లేవని, వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చాడు. ఈయన మాట్లాడుతూ కొంతమంది హాఫ్ నాలెడ్జ్ తో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అసంతృప్తిని తెలిపారు. BRS ప్రభుత్వంలో ప్రజలకు విశేషమైన వైద్య సేవలను అందిస్తున్నామని… ఇంకా మరెన్నో కొత్త వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. తెలంగాణ ప్రజలు వైద్య సేవల పరముగా సంతోషంగా ఉన్నారని కొందరికి మాత్రం చాలా బాధగా ఉందన్నారు. నిమ్స్ లో రాజకీయ ప్రమేయం లేకుండా చేశామన్నారు మరియు ఎక్కడా ఖాళీలు లేకుండా స్టాఫ్ ను రిక్రూట్ చేశామని హరీష్ రావు పేర్కొన్నారు.
ఈ విధంగా పరోక్షముగా రాష్ట్ర గవర్నర్ పై వైద్యశాఖామంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వానికి మరియు గవర్నర్ కు సరైన సఖ్యత లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.