ఇటీవల బీజేపీ జనరల్ సెక్రెటరీ గా ఉన్న పురందేశ్వరిని అధిష్టానం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది. అప్పుడే ఆమె శక్తిసామర్ద్యాల పైన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో చర్చలు జోరుగా నడుస్తున్నాయి. కాగా ఇప్పుడు ఒక విషయంపై పురందేశ్వరికి మరియు బీజేపీ సీనియర్ నాయకుడు జివిఎల్ నరసింహారావుకు మధ్యన విబేధాలు తలెత్తే అవకాశం ఉంది. కాగా ఇది పురందేశ్వరికి ఎదురైనా మొదటి సవాలుగా భావించాలి. పురందేశ్వరి గతంలో విశాఖపట్టణం నుండే ఎంపీగా గెలిచింది. ఇప్పుడు ఎలాగు బీజేపీ అధ్యక్షురాలిగా ఉండడం వలన గెలిచిన స్థానం నుండే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని భావిస్తోందట. ఇక బీజేపీ సీనియర్ నేత జివిఎల్ నరసింహారావు సైతం విశాఖ నుండే ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పరిస్థితులను బట్టి అర్ధమవుతోంది.
అందులో భాగంగా విశాఖ సిటీ మొత్తం “GVL4VIJAG” అనే పేరుతో పోస్టర్లు వేశారట. ఇప్పుడు వీరిద్దరి మధ్యన ఎంపీ సీటు పై క్లాష్ జరిగే అవకాశం ఉంది. మరి పైచేయి ఎవరిది కానుంది అన్నది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.