BREAKING : కలుషిత ఆహారం తిని.. 70 మంది విద్యార్థినులకు అస్వస్థత

-

వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో 70 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి నుంచి కడుపులో మంట, వాంతులకు గురయ్యారు. విద్యాలయంలో ఒక్కరే టీచర్‌ ఉండటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లలేదు. ఉదయం పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 35 నుంచి 40 మంది  విద్యార్థినులను మెరుగైన జిల్లా ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. సాంబారు, వంకాయ కూరతో భోజనం చేసిన వారంతా అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆత్మకూరు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. తమ పిల్లలు అనారోగ్యానికి గురవడం చూసి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పరిస్థితి కాస్త తీవ్రంగా ఉన్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆహారం కలుషితం కావడం వల్లే వారు అస్వస్థతకు గురయ్యారా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. ముఖ్యంగా అస్వస్థతకు గురైన వారిలో తొమ్మిదో, పదో తరగతి, ఇంటర్ విద్యార్థినులే ఎక్కువగా ఉండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news