బంగ్లా ప్రధాని రిక్వెస్ట్ మేరకు తమీమ్ ఇక్బల్ రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు…

-

ఒక్క రోజులోనే బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బల్ విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్ననే తమీమ్ ఇక్బల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.. దీనితో దేశంలోని తమీమ్ ఫ్యాన్స్ అందరూ సోషల్ మీదకి వేదికగా చాలా బాధపడ్డారు. క్రికెట్ నుండి తప్పుకోవద్దంటూ వేడుకున్నారు.. ఇంతలోనే తమీమ్ ఇక్బల్ కోసం బాధపడిన వారందరికీ శుభవార్తను అందించింది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. వాస్తవంగా తమీమ్ రిటైర్ కావడం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ కు కూడా ఇష్టం లేదు. ఈయన నిన్నటి నుండి ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈ విషయం ప్రధాని షేక్ హసీనా దృష్టికి వెళ్లగా, ఆమె వెంటనే తమీమ్ ను రమ్మని కలవాలని ఆహ్వానం పంపడంతో.. కాసేపటి క్రితమే తమీమ్ ఇక్బల్ ప్రధానిని కలిసి మాట్లాడిన అనంతరం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

దీనితో బంగ్లా క్రికెట్ బోర్డు తో పాటుగా అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news