ద్వైపాక్షిక సిరీస్: బంగ్లాదేశ్ ముందు భారీ టార్గెట్ గెలిస్తేనే సిరీస్ ఆశలు…

-

ఈ రోజు చట్టోగ్రామ్ స్టేడియం లో బంగ్లాదేశ్ మరియు ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్యన జరుగుతునం రెండవ వన్ డే లో టాస్ ఒడి బ్యాటింగ్ కు వచ్చిన ఆఫ్గనిస్తాన్ నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఇంతటి స్కోర్ చేయడానికి ప్రధాన కారణం ఆ జట్టు ఓపెనర్లు అని చెప్పాలి, ఇద్దరూ చెలరేగి ఆడి జట్టుకు బంగ్లాకు పోటీ ఇవ్వగల స్కోర్ ను అందించారు. ముందుగా రహమణుల్లా గుర్బాజ్ వీరోచిత సెంచరీ (145) చేశాడు, ఇతని ఇన్నింగ్స్ సాగిన తీరు చూస్తే ఖచ్చితంగా డబుల్ సెంచరీ సాధిస్తాడని అనుకున్నారు. కానీ షకీబ్ బౌలింగ్ లో అనూహ్యంగా అవుట్ అవడంతో నిరాశగా పెవిలియన్ కు చేరాడు. ఇతను అవుట్ అవ్వగానే మరో ఓపెనర్ ఇబ్రహీం జాడ్రాన్ సరిగ్గా 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అత్యధిక స్కోర్ చేసింది ఎక్సట్రాలు అని చెప్పాలి.. బంగ్లా మొత్తం 33 అదనపు పరుగులను ఇచ్చింది.

మరి బంగ్లాదేశ్ ఈ టార్గెట్ ను ఛేదించి… సిరీస్ ను సజీవంగా ఉంచుకుంటుందా లేదా ఓడిపోయి సిరీస్ ను పోగొట్టుకుంటుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news