బరువు ఎక్కువైందని 19 మంది ప్రయాణికులను విమానం నుంచి దింపేసిన ఈజీ జెట్‌

-

ఈ మధ్య విమానాల్లో తరచూ ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. కొన్ని సార్లు సీట్‌ కోసం కొట్టుకున్నారు, వీండో సీట్‌ కోసం లొల్లి పెట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జరిగింది మాత్రం ఇంకా హైలెట్‌. బరువు ఎక్కువైందని విమానం నుంచి 19 మందిని దింపేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతుందో. అసలేం జరిగిందంటే..

ప్రతికూల వాతావరణం వల్ల టేకాఫ్‌ కష్టమని భావించిన పైలట్‌ బరువు ఎక్కువైందని విమానంలో అప్పటికే ఎక్కి ఉన్న 19 మంది ప్రయాణికులను అర్థాంతరంగా దించేశారు. ఈ ఘటన స్పెయిన్‌లోని లాంజ్రోట్‌ విమానాశ్రయంలో జరిగింది.

గత బుధవారం(జులై 5,2023)బ్రిటన్‌కు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఈజీ జెట్(easyjet)విమానం స్పెయిన్ నుంచి బ్రిటన్‌కు ప్రయాణించాల్సి ఉంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల 45 నిమిషాలకు ఆ విమానం స్పెయిన్ లోని లాంజ్రోట్‌ విమానాశ్రయం నుంచి స్టాట్‌ అవ్వాలి. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చిన్న రన్‌వే నేపథ్యంలో విమానం బరువు ఎక్కువగా ఉందని టేకాఫ్‌ కష్టమని పైలట్‌ భావించారు. విమానం టేకాఫ్ కావాల్సిన సమయం మించిపోవడంతో పైలట్లు ఎలాగైనా విమానాన్ని టేకాఫ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. దీంతో బరువైన ఈ విమానం టేకాఫ్ కష్టమని..20 ప్రయాణికులు దిగిపోతే టేకాఫ్ సాధ్యమవుతుందని పైలట్ చెప్పాడు. 20 మంది విమానం దిగి తమ ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాలని పైలట్ సూచించారు.

విమానం దిగిన వారికి 500 యూరోలు పారితోషికం కూడా ఇస్తామని ఈజీ జెట్ సంస్థ ప్రకటించింది. అయినప్పటికీ ఏ ఒక్క ప్రయాణికుడూ ముందుకు రాలేదు. చివరికి ఈజీ జెట్ సంస్థ 19 మంది ప్రయాణికులకు నచ్చజెప్పి తర్వాతి దింపేసింది. వారు దిగిన తర్వాత రెండు గంటల ఆలస్యంగా రాత్రి 11.24 గంటలకు టేకాఫ్ అయింది. ఇక ఆ 19 మంది ప్రయాణికులను ఆ తర్వాత విమానంలో పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో తెగ వైరల్‌ అవుతుంది. లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news