‘బిగ్‌బాస్‌-7’ ప్రోమో వచ్చేసింది.. ఈ సారి హోస్ట్‌ ఎవరో?

-

టీవీ ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది. బిగ్ బాస్-7 సీజన్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియోని పంచుకున్నారు. ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారమవుతుందని తెలిపారు. ఈసారి మరిన్ని సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగ్‌ అంశాలు, భావోద్వేగాలు ఉంటాయని ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తించారు. ఈ కార్యక్రమం ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లోనూ స్ట్రీమింగ్‌ కానుందని వెల్లడించారు.

అయితే సీజన్‌ 7కి వ్యాఖ్యాతగా ఎవరు వ్యవహరిస్తారు? కంటెస్టెంట్లు ఎవరు? అని ప్రేక్షకులు తెగ ఆలోచించేస్తున్నాయి. ఎవరైతే హోస్టుగా బాగుంటుంది అంటూ కామెంట్ బాక్సులో చర్చ సాగిస్తున్నారు. 3, 4, 5, 6 సీజన్లను హోస్ట్‌ చేసిన ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున ఈ కొత్త సీజన్‌కీ వ్యాఖ్యాతగా ఉంటారని టాక్‌ వినిపించగా, మరోవైపు, రానా దగ్గుబాటి పేరు తెరపైకి వచ్చింది.  మరి, వీరిలో ఎవరు ఆ ఛాన్స్‌ అందుకున్నారో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. సెప్టెంబరు మొదటి వారంలో ఈ షో ప్రారంభంకానుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news