కేంద్రం నుండి నేరుగా ఖాతాలో రూ. 11000… వెంటనే ఈ పని చేసేయండి.. ఈరోజే లాస్ట్ డేట్..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ని అందిస్తోంది. రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిది యోజన స్కీమ్ ని అందిస్తోంది కేంద్రం. ఈ స్కీమ్ తో చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. అలానే ఈ స్కీమ్ తో ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ డబ్బులని పొందే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని పొందేందుకు ఇదే ఆఖరి రోజు. ఈ పథకం ద్వారా ఇప్పుడు మీరు కూడా రూ. 11 వేలు పొందవచ్చు.

నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో కేంద్ర ప్రభుత్వమే ఈ డబ్బులని జమ చేస్తుంది. జులై 13తో అనగా నేటితో ఈ ఆఫర్ గడువు ముగిసిపోతుంది. మై గౌ కొత్త విషయాన్ని వెల్లడించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌కు లోగో డిజైన్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ స్కీమ్ కి లోగో ని డిజైన్ చేసి పంపాలి. జులై 13, 2023 తేదీ వరకే అందుబాటు లో ఉంది.

కేవలం ఈ ఒక్క రోజే ఛాన్స్. ఓ అదిరి పోయే లోగో డిజైన్ చేసి పంపితే డబ్బులని పొందవచ్చు. ఈ కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన వారికి రూ. 11 వేలు వస్తాయి. కన్సోలేషన్ ప్రైజెస్ కింద ఇద్దరికి రూ. 5 వేల చొప్పున వస్తాయి. మై గౌ (MyGovIndia) వెబ్‌సైట్‌ లోకి వెళ్లి మీరు ఈ పోటీలో పాల్గొనవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news