సామాజికవర్గాల పరంగా తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీల ఓట్లపై కేసిఆర్ గేలం వేశారు. గత రెండు ఎన్నికల్లో బిసిలు బిఆర్‌ఎస్ పార్టీకే మద్ధతు ఇచ్చారు. ఈ సారి కూడా వారి మద్ధతు పోకుండా ఉండేలా కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి బిసిలు వన్ సైడ్ గా బిఆర్‌ఎస్‌కు ఓటు వేయడం అనేది కాస్త కష్టమైన విషయమే. అటు కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీకి వస్తుంది.
ఈ నేపథ్యంలో బిసిల ఓట్లని కొల్లగొట్టడానికి కేసిఆర్..కొత్తగా బిసి కుల వృత్తులకు సాయం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ప్రకారం..కుల వృత్తుల చేసుకునే వారికి రూ. లక్ష సాయం చేయనున్నారు. అంటే దళితబంధు పథకం లాంటిదే ఇది కూడా. దళిత బంధు కింద…దళితులకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ పథకం పూర్తిగా సక్సెస్ కాలేదు. పథకం విడతల వారీగా ఇవ్వడం అది కూడా బిఆర్‌ఎస్ నేతల రికమండేషన్ తోనే పథకం ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
అయితే పథకం అందినవారు తక్కువ ఉంటే..అందని వారు ఎక్కువ ఉన్నారు. దీని వల్ల అందని వారు బిఆర్‌ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు బిసి పథకం కూడా అలాగే అయ్యేలా ఉంది. రాష్ట్రంలో బిసిలు అత్యధికంగా ఉన్నారు. కానీ ఇప్పుడు పథకం నియోజకవర్గానికి 300 మందికే ఇస్తామని అంటున్నారు. దీని వల్ల పథకం అందని బిసిలు ఎక్కువ ఉంటారు.
ఎలాగో ఎన్నికల్లోపు పథకం అందించేలేరు. దీని వల్ల వారు బిఆర్‌ఎస్ పార్టీకి యాంటీ అయ్యే అవకాశం ఉంది..దీని వల్ల నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బిసి పథకం విషయంలో ఆచి తూచి ముందుకెళ్లాలి. ఎన్నికల కోసమే కాదు..పథకం అందరికీ అందుతుందనే భరోసా ఇవ్వాలి..అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది.