గత సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఎప్పటిలాగే ఆ ఎన్నికలలో బీజేపీ ఘనవిజయాన్ని సాధించి మళ్ళీ సీఎంగా యోగి ఆదిత్యానంద్ అయ్యారు. ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న ధారా సింగ్ చౌహన్ పార్టీని వీడి సమాజ్ వాద్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ పార్టీ నుండి మవ్ జిల్లా లోనే ఘోషి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు. కానీ పార్టీలో నేతల మధ్యన ఈయనకు అభిప్రాయబేధాలు కుదరకనో లేదా మరేఇతర కారణాల వల్లనో తెలియదు. తాజాగా తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానాకు ఇచ్చారు. కానీ అధికారికంగా ఈయన ఎందుకు రాజీనామా చేశారు అన్న విషయం గురించి ఏ క్లారిటీ లేదు.
అయితే మళ్ళీ సొంతగూటికి చేరుతారా ? లేదా మరేదైనా పార్టీకి వెలుతారా ? అన్న విషయంపై ఇంకా ఒక స్పష్టత రాలేదు. ఈ విషయంపై సమాజ్ వాదీ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా తెలియాల్సి ఉంది.