ఈ రోజుతో ఆషాడం ముగుస్తుంది. ఈరోజు ఆషాడ అమావాస్య. సోమవారం వచ్చింది కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అంటారు. ఈరోజు రావి చెట్టు మూలంలో ఉన్న విష్ణుని పూజిస్తారు.ఇలా చేస్తే జాతక దోషాలు పోతాయని విశ్వసిస్తారు. సూర్యుడు దక్షిణాయనం ప్రారంభించిన తర్వాత వచ్చిన మొదటి అమావాస్య ఇది. ఈరోజు తప్పనిసరిగా సూర్యుడిని ఆరాధించాలి. సోమవతి అమావాస్య సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వస్తుందట.
హిందూమత విశ్వాసాల ప్రకారం సోమవతి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం చేస్తారు. శివ పార్వతులను పూజిస్తారు. ఈ అమావాస్య రోజు పితృ దేవతలను కూడా భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటారు. ఈ అమావాస్య రోజున పితృ దేవతలు వారి సంతానాన్ని ఆశీర్వదించడానికి భూలోకానికి వస్తారని పండితులు అంటున్నారు. ఈరోజు పితృ తర్పణం, పితృ కర్మలు చేయడం శ్రేష్ఠం. అలాగే ఈ రోజున శివుడిని పూజించడము, నీటిని దానం చేయడం ద్వారా పుణ్యఫలం పెరుగుతుంది.
ఇవి దానం చేస్తే మంచిది..
ఈ అమావాస్య రోజు పవిత్ర నదులలో స్నానం చేయడం, బ్రాహ్మణులకు ఆహార ధాన్యాలు దానం చేయడం, పాదరక్షలు, గొడుగు దుస్తులు మొదలైనవి దానం చేయడం చాలా శ్రేష్ఠం. ఆవులు, కుక్కలు చీమలకు ఆహారం ఇవ్వాలి. ఈరోజు నల్లనువ్వులు, బార్లీ గింజలు, పాలు, తామరపువ్వు కలిపి రావి చెట్టులో పెట్టి ఓం నమో పితృభాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
సోమావతి అమావాస్య రోజున ఇలా చేయకండి..
ఈరోజు జుట్టు గోర్లు కత్తిరించకూడదు.
మహిళలు తలస్నానం చేయకూడదు.
మాంసము మద్యానికి దూరంగా ఉండాలి.
ఈ రోజున సొరకాయ, దోసకాయ శనగలు, జీలకర్ర, ఆవాలు, ఆకుకూరలు తినకూడదు. ఎ
టువంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు.
ఈరోజు వస్తువులు కొనడం మానుకోవాలి.
గొడవలకు దూరంగా ఉండాలి