BREAKING : తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్ జారీ

-

BREAKING : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రెడ్‌ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్‌ వాతావరణ శాఖ. గత రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది.

దాదాపు 40 రోజుల తర్వాత ఏకధాటి వాన కురుస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర రైతులతో పాటు ప్రజలు కూడా సంబుర పడుతున్నారు. అయితే… నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు ఉన్నట్లు తాజాగా హైదరాబాద్‌ వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నట్లు చెప్పింది. ఖమ్మం, మహబూబాబాద్, జనగాం జిల్లాలకు రెడ్‌ అలర్ట్ చేసింది హైదరాబాద్‌ వాతావరణ శాఖ. అటు కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news