ఉమ్మడి నల్గొండలో 12 సీట్లూ కాంగ్రెస్​వే : ఎంపీ కోమటిరెడ్డి

-

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ ప్రారంభమైంది. ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీలో చేరికలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క్ పాల్గొన్నారు. మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌రెడ్డికి ఎంపీ కోమటిరెడ్డి ఘనస్వాగతం పలికారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీలో  ఎవరూ చేరాల్సిన అవసరం లేదని తెలిపారు. 12 స్థానాలు రిజర్వ్‌ అయ్యాయని స్పష్టం చేశారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే వీరేశం పార్టీలో చేరే అంశం ఇప్పటి వరకు చర్చకు రాలేదని చెప్పారు. త్వరలోనే ఎన్నికల నేపథ్యంలో ప్రచార ఉద్ధృతిపై చేపట్టాల్సిన వ్యూహ రచన కోసమే అగ్రనేతలను భేటీకి ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఆగస్టు నుంచి పార్టీ నేతలంతా కలిసికట్టుగా బస్‌ యాత్ర చేయాలన్నదే తన కోరిక అని చెప్పారు. ఇక నుంచి వరుసగా సీనియర్‌ నేతల ఇళ్లలో సమావేశాలు నిర్వహిస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news