ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే అమరావతిలోని ముస్లిం ప్రజాప్రతినిధులు , మాత పెద్దలు మరియు ఆ వర్గాలని చెందిన మిగిలిన ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ముస్లిం వర్గాలు కేంద్రం తీసుకురానున్న ఉమ్మడి పౌర స్మృతి బిల్లు గురించి సందేహాలను అడగడం జరిగింది. ఈయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీది.. బడుగు, బలహీన మైనారిటీల కోసం ఏర్పడింది అని గుర్తుంచుకోండి అంటూ వారికి మద్దతుగా మాట్లాడారు జగన్. ఎవ్వరూ ఈ బిల్లు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి భరోసాను కల్పించారు. ఇప్పటి వరకు ఉమ్మడి పౌరస్మృతి బిల్లు గురించిన డ్రాఫ్ట్ రెడీ కాలేదన్నారు. కనీసం ఆ బిల్లు ఏమిటి ? నిబంధనలు ఏమిటి ? ఇలా చాలా అంశాలు అందులో పొందుపరచబడి ఉంటాయి. ఎవ్వరికీ ఈ విషయాలు తెలియదు.. కానీ దీనిని దేశ వ్యాప్తంగా హైలైట్ చేశారు.
అందుకు వివిధ రాష్ట్రాలలో ఉన్న ముస్లిం సోదరులు దేనిపై ఆందోళన చెందుతున్నారు అంటూ బిల్లు గురించిన వాస్తవికతను వారికి తెలియచేశారు సీఎం జగన్.