‘కిషన్’ కమలం..రేసులోకి తెస్తారా?

-

మొత్తానికి కిషన్ రెడ్డి తెలంగాణ బి‌జే‌పి అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకునే ముందు..బి‌జే‌పి అనూహ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై పోరాటం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో బాగా హైలైట్ అయింది. ఈ అంశం బి‌జే‌పికి మరింత ఊపు తెస్తుందనే చెప్పవచ్చు. బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు..ఏ స్థాయిలో దూకుడుగా పనిచేసేవారో అందరికీ తెలుసు. దీంతో బి‌జే‌పి దూకుడుగా రాజకీయం చేసింది..కాంగ్రెస్ ని సైతం వెనక్కి నెట్టి రేసులోకి వచ్చింది.

కానీ తర్వాత జరిగిన పరిణామాలు బి‌జే‌పిని వెనక్కి నెట్టేశాయి. అటు కాంగ్రెస్ పుంజుకుంది. ఈ క్రమంలోనే బి‌జే‌పిలో అనుహ్యా మార్పులు జరిగాయి. బండిని అధ్యక్ష స్థానం నుంచి తప్పించి కిషన్ రెడ్డిని నియమించారు. అయితే దూకుడుగా ఉండే బండిని తప్పించి..మెతక వైఖరితో ఉండే కిషన్ రెడ్డిని నియమించడం పై విమర్శలు వచ్చాయి. ఇక బి‌జే‌పి పని అయిపోయినట్లే అని కామెంట్లు వచ్చాయి. కానీ అనూహ్యంగా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టక ముందు కిషన్ రెడ్డి..డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అంశంలో పోరాటం చేయడం ఆకట్టుకుంది.

కే‌సి‌ఆర్ ప్రభుత్వం డబుల్ ఇళ్ళలో అక్రమాలకు పాల్పడుతుందని, అసలు లబ్దిదారులకు అందడం లేదని..అలాగే ఆ ఇళ్ల నిర్మాణం ఎలా జరుగుతుందని చెప్పి బాటసింగారంలోని ఇళ్లని పరిశీలించేందుకు బి‌జే‌పి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ సహ పలువురు నేతలని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాటసింగారంకు బయలుదేరిన కిషన్ రెడ్డి, రఘునందన రావులని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని..అదుపులోకి తీసుకుని బి‌జే‌పి కార్యలయంకు తీసుకొచ్చి వదిలేశారు.

ఇక ఇక్కడ నుంచి కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై యుద్ధం మొదలైందని, ఇళ్లని చూడటానికి వెళుతుంటే కే‌సి‌ఆర్‌కు భయం ఎందుకని కిషన్ ప్రశ్నించారు. ఇలా బాధ్యతలు చేపట్టక ముందు కిషన్ పోరాటం బి‌జే‌పికి ఊపు తెచ్చింది. ఇక ఇప్పుడు అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటున్నారు. మరి ఇక్కడ నుంచి కమలం పార్టీని కిషన్ రెడ్డి ఏ విధంగా రేసులోకి తీసుకొస్తారు..బి‌జే‌పిని ఎలా బలోపేతం చేస్తారనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news