ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి..తాజాగా వాలంటీర్లపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పవన్, లోకేష్, బాలయ్య, చంద్రబాబు టార్గెట్ గా జగన్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. మహిళల విషయంలో గతంలో వారు ఎలా అసభ్యకర కామెంట్స్ చేశారో అంటూ కొన్ని విషయాలు చెప్పారు. అయితే జగన్..బాలయ్య అభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే కరెక్ట్ గా గమనిస్తే..జగన్ ఎప్పుడు కూడా బాలయ్య ప్రస్తావన తీసుకురారు.
ఏదొక ఒకటి, రెండు సందర్భాలు మినహా బాలయ్యని విమర్శించరు. కానీ తాజాగా బాలయ్య పేరు తీయలేదుగాని..అమ్మాయిలు కనబడితే ముద్దైనా పెట్టాలి..కడుపు అయినా చేయాలని మాట్లాడే దౌర్భాగ్యుడు ఒకరు అంటూ.. జగన్ కామెంట్ చేశారు. ఎప్పుడో బాలయ్య..ఓ సినిమా ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలని ఇప్పుడు మాట్లాడారు. ఇక దీనిపై బాలయ్య ఫ్యాన్స్..జగన్ పై మండిపడుతున్నారు. బాలకృష్ణ సినిమా పులివెందుల్లో వంద రోజులు ఆడుతుందని, తల్లి క్యాన్సర్‌తో చనిపోయిందని తల్లుల కొరకు క్యాన్సర్ ఆసుపత్రి పెట్టిన చరిత్ర బాలయ్యదని, బాలకృష్ణ మీద అసందర్భ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ పెడుతున్నారు.
అయితే ఇదంతా జగన్‌కు తెలిసి అంటున్నారని తాము అనుకోవడం లేదని, ఎవరో స్క్రిప్ట్ పేపర్ రాసిస్తే వాటిని జగన్ చదివారని తెలుస్తుందని అన్నారు. అలాగే జగన్ చేసిన వ్యాఖ్యలకు బాలయ్య అంతకముందే అసెంబ్లీలో వివరణ ఇచ్చారని అంటున్నారు. ఓ సినిమా ఫంక్షన్ లో తాను నటించిన పవిత్ర ప్రేమ సినిమాలో క్యారెక్టర్ గురించి చెబుతూ..అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి..అలాంటి క్యారెక్టర్ అని చెప్పడానికి తాను చేసిన వ్యాఖ్యలు అవి అని క్లారిటీ ఇచ్చారని, కానీ ఇప్పుడు వాటిని వైసీపీ వక్రీకరిస్తూనే చెబుతుందని ఫైర్ అవుతున్నారు.