వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ జరిమానాలపై ఏపీ రవాణా శాఖ కీలక సూచనలు

-

ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ ట్రాఫిక్ జరిమానాలపై కీలక సూచనలు చేపట్టినట్టు వార్తలు వచ్చాయి. ఇయర్‌ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకుని వాహనం నడిపితే వాహనదారులపై రూ.20 వేల జరిమానా వడ్డిస్తారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రంలో కలకలం రేగుతోంది. ఈ నేపధ్యం లో ఏపీ రవాణా శాఖ కమిషనర్ ఈ అంశంపై స్పందించారు. ఇదంతా అసత్య ప్రచారమని ఆయన తేల్చి చెప్పేశారు.

Andhra Pradesh challan due date vehicle owners traffic rules violators  penalty last date | India News – India TV

మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్‌‌ ఫోన్‌ పెట్టుకుని వాహనం నడిపుతూ పట్టుబడితే రూ.1500 నుంచి రూ.2 వేల జరిమానా విధిస్తున్నట్టు వెల్లడించారు ఆయన. పదేపదే ఇదే నేరం చేస్తే రూ.10 వేల వరకూ జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు ఆయన. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన జరిమానాలు విధిస్తున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రూల్స్ చాలా కాలంగానే అమల్లో ఉన్నాయని చెప్పిన ఆయన, జరిమానా పెంపు ఆలోచన లేదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దని అన్నారు ఆయన.

 

 

Read more RELATED
Recommended to you

Latest news