వనమా పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వు

-

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు బుధవారంనాడు హైకోర్టును ఆశ్రయించారు. తాను సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు తీర్పును నిలిపివేయాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే ఈ విషయమై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. 2018 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో తన భార్య పేరున ఉన్న ఆస్తులు, కేసుల వివరాలను సమర్పించలేదని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరావుపై మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు 2019 లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 25న కీలక తీర్పును వెల్లడించింది. వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటేసింది. 2018 నుండి ఎమ్మెల్యేగా జలగం వెంకటరావు కొనసాగుతారని హైకోర్టు తేల్చి చెప్పింది.

MLA Vanama Venkateswara Rao Filed Lunch Motion Petition In TS High Court -  Sakshi

ఈ పిటిషన్ పై విచారించిన తెలంగాణ హైకోర్టు ఈనెల 25న కీలక తీర్పును ఇచ్చింది. అంతేకాకుండా వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటేసింది. 2018 నుండి ఎమ్మెల్యేగా జలగం వెంకటరావు కొనసాగుతారని న్యాయస్థానం తెలిపింది. మరోవైపు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు సీఈవో వికాస్ రాజ్ ను కలిశారు. హైకోర్టు జడ్జ్ మెంట్ ను అమలు చేయాలని ఆయన తెలిపారు. సాయంత్రం హైకోర్టు తీర్పు కాపీని సీఈవోకు జలగం అందజేసారు. ఇవాళ ఉదయం తెలంగాణ హైకోర్టు నిర్ణయం పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీకి అందజేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news