ఐటీ రిటర్న్ ఇప్పటికే చాలా మంది ఫిల్ చేశారు. రిఫండ్ కూడా వచ్చేసింది. అయితే కొందమందికి ఐటీ శాఖ నోటిసులు పంపిస్తుంది. ఆదాయపు పన్ను శాఖ నోటిసీలు పంపగానే చాలా మంది భయపడతారు. అరే మనం ఐటీ రిటర్న్ చేసేప్పడు ఏదైనా తప్పు చేసి ఉంటాం.. అందుకే పంపిందని టెన్షన్ పడతారు. ఇంకేం ఉంది గట్టిగానే జరిమానా కట్టాలి, తీసుకెళ్లి జైలులో గిట్ల వేస్తారేమో అని మనకు మనమే ఏవేవో ఊహించుకుంటాం. అసలు నోటీసులు వస్తే ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం.
ఆంధ్రా, తెలంగాణలో రీసెంటుగా వందల మందికి ఇలాంటి నోటీసులు రావడం కలకలం సృష్టించింది. ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు రాగానే ముందు చేయాల్సిన పని ఆ నోటీసులు క్షుణ్ణంగా చదవి అర్థం చేసుకోవడం. ఆదాయపన్ను చట్టంలోని వివిధ సెక్షన్లను అనుసరించి ఐటీ శాఖ నోటీసులు పంపిస్తుంది. ఇందులో అదనపు పత్రాలు సమర్పించడం నుంచి రీఆడిటింగ్ వరకు చాలా ఉంటాయి. అందుకే ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చిందంటే మీరు తప్పు చేసిన్టటేమీ కాదు. రొటీన్ కమ్యూనికేషన్ కూడా అవ్వొచ్చు. ఏదేమైనా నోటీసులు సకాలంలో సరిగ్గా స్పందించడం చాలా ముఖ్యం.
ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకపోతే అనవసరంగా సమస్య పెద్దది చేసుకున్నట్లే అవుతుంది. దాంతో మీరు జరిమానా, అదనపు పన్నులు, వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. కొన్నిసార్లు జైలు శిక్షకు గురవుతారు. కాబట్టి ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చాయాంటే మీరు ముందు ఆ నోటీస్ సారాంశం ఏంటో అర్థం చేసుకోండి. అందులోని నిర్దేశించిన గడువులోపే స్పందించండి. విషయం అర్థమవ్వకపోతే నిపుణులను సంప్రదించండి. అడిగిన అంశానికి సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. ఐటీఆర్ ఫైలింగు పొరపాటుపై నోటీసు వస్తే సరిదిద్దుకోవడానికి ఇదే అవకాశంగా గుర్తించండి. గడువు తీరితే ఐటీ శాఖకు అప్పీల్ చేసుకోండి.
ఏ ఏ అంశాలపై నోటీసు పంపిస్తుంది..?
టాక్స్ రిటర్నుకు సంబంధించి మరింత సమాచారం అడగొచ్చు.
మీ టాక్స్ రిటర్ను ఆడిట్ కోసం నోటీసు ఇవ్వొచ్చు.
నిబంధనలను ఉల్లంఘించినట్టు భావిస్తే పెనాల్టీ నోటీసులు వస్తాయి.
మీరు ఒకవేళ కట్టాల్సిన దానికన్నా తక్కువ పన్ను చెల్లిస్తే అదనపు పన్నులు చెల్లించాల్సిందిగా ఐటీ శాఖ కోరుతుంది.
చెల్లించని మొత్తానికి వడ్డీలు కోరుతుంది.
కొన్ని కేసుల్లో మాత్రం క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉంటుంది.
ఇన్‌టాక్స్ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. టాక్స్ పేయర్ తన పన్ను బాధ్యత నుంచి తప్పించుకోకుండా, తప్పుడు క్లెయిమ్స్ చేయకుండా ఐటీ డిపార్ట్‌మెంట్ గట్టి చర్యలు తీసుకుంటోంది. డిపార్ట్‌మెంట్ నుంచి రావలసిన రిఫండ్ తక్కువగా వచ్చినా, దానిపై అప్పీల్ చేయడానికి కూడా అనుమతి ఇస్తోంది.