ఎయిడ్స్‌కు చికిత్స ఉంది.. ఆ సర్జరీతో నయం చేయొచ్చంటున్న శాస్త్రవేత్తలు

-

ఎయిడ్స్‌కు చికిత్స లేదు నివారణ ఒక్కటే మార్గం అని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. అందుకే ఆ సమయంలో సెఫ్టీ వాడాలి, సురక్షిత సెక్స్‌తోనే హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ లాంటి వాటిని నివారించగలం. ఎయిడ్స్‌ బారిన పడితే.. చావు తప్పదు. అది కొన్ని రోజులు లేట్‌ అయినా సరే.. ఏదో ఒక రోజు మాత్రం చావాల్సిందే. అన్నింటికంటే ఘోరం హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తెలిస్తే.. సమాజం వెలివేస్తుంది. వారి వారసత్వాన్ని కూడా అంటరాని వాళ్లలా చూస్తుంది. సమాజంలో ఇప్పటికీ ఆ రోగి స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. ఇప్పుడు పరిశోధకులు చేసిన ఓ అధ్యయనం వీరికి తిరిగి ఊపిరిపోస్తుంది. ఓ శస్త్ర చికిత్స ద్వారా ఎయిడ్స్‌ను నివారించవచ్చని పరిశోధకులు అంటున్నారు. ఒక హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ తర్వాత హెచ్ఐవీ పాజిటివ్ పేషెంట్ పూర్తిగా కోలుకున్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

హెచ్‌ఐవీతో బాధపడుతోన్న ఓ రోగికి వైద్యులు ‘జెనీవా పేషెంట్’గా నామకరణం చేసి కొన్ని చికిత్సలు చేశారు. బోన్ మ్యారో ట్రాన్స్‌‌ప్లాంట్ సర్జరీ తర్వాత కొద్ది రోజులు అతడిని అబ్జర్వ్ చేశారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అతడిలో అస్సలు హెచ్ఐవీ ఛాయలే కనిపించలేదచ. అన్ని ఫలితాలు నెగిటివ్ వచ్చాయి. దీంతో వైద్యుల ఆనందానికి అవధుల్లేవు. ఇప్పుడు ఆ రోగి హ్యపీగా జీవితం గడుపుతున్నాడు. ఈ పేషెంట్ 1990 నుంచి ఎయిడ్స్‌తో పోరాడుతున్నాడు.

హెచ్ఐవీ విషయంలో చాలా పురోగతి సాధించినట్టే అనుకోవాలి. చాలామంది హెచ్ఐవీ పాజిటివ్ పేషెంట్ల జీవన నాణ్యత మాత్రమే కాదు, జీవిత కాలం కూడా పెరిగింది. అంతేకాదు వైరస్ సాంద్రత కూడా శరీరంలో గుర్తించలేనంత తక్కువ స్థాయికి చేరుకుంటోందని పరిశోధకులు అంటున్నారు. ఈ పరిస్థితి వారి నుంచి వ్యాధి సంక్రమించే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇప్పటికే ఐదురుగురు హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులు పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ప్రకటించారు. లుకేమియా వంటి ప్రాణాంతక స్థితిలో ఉన్న పేషెంట్లకు బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్స చేస్తారు. ఈ చికిత్స వల్ల దాత నుంచి వచ్చిన CCR5 జీన్ మ్యూటేషన్ వల్ల హెచ్ఐవీ శరీర కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

2018లో జేనీవా పేషెంట్.. తీవ్రమైన లుకేమియా సమస్యతో బాధపడ్డాడు. దీంతో స్టెమ్ సెల్ మార్పిడి చికిత్స తీసుకున్నాడు. అదే అతడిలో హెచ్‌ఐవీ నివారణకు కారణమైంది. జనీవా యూనివర్సిటీ హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకున్న ఈ ఆరో పేషెంట్ మాత్రం CCR5జన్యు మ్యూటేషన్ తో సంబంధం లేకుండానే కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. చికిత్స తర్వాత అతడు 20 నెలల పాటు హెచ్ఐవి చికిత్సకు సంబంధించిన మందులు మానేసినప్పటికీ అతడిలో హెచ్ఐవి ట్రేస్ కనిపించలేదని అక్కడి నిపుణులు ప్రకటించారు.

తిరిగి అతడి శరీరంలో వైరస్ కనిపించదని చెప్పేందుకు ఎలాంటి రుజువులు కనిపించలేదనే హెచ్చరిక అలాగే ఉంది. ప్రస్తుతానికి అతడిలో హెచ్ఐవీ వైరస్ ట్రెసెస్ కనిపించడం లేదని మాత్రం పరిశోధకులు స్పష్టం చేశారు. 5 సంవత్సరాల్లో వైరస్ తిరిగి రాకపోతే మాత్రమే పూర్తిగా నయమయినట్టు భావించాల్సి ఉంటుంది. అయితే 12 నెలల్లో వైరస్ గుర్తులేవీ కనిపించకపోతే హెచ్ఐవీ నుంచి పూర్తిగా భయటపడినట్లే. కానీ ఒకేఒక్క హెచ్ఐవీ కణం మిగిలిపోయినా వ్యాధి తిరిగి పుంజుకునే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు హెచ్ఐవి నుంచి పూర్తిస్థాయిలో బయటపడిన వారంతా క్యాన్సర్ పేషెంట్లు కావడం విశేషం. ఈ పరిశోధన పూర్తి స్థాయిలో సక్సస్‌ అయితే ఎంతో మందికి తిరిగి ప్రాణం పోసినట్లే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news