స్మశానంలో దీపావళి వేడుకలు.. ఎక్క‌డంటే..

-

సాధార‌ణంగా దీపావళి పండుగ అంటే ఇల్లంతా దీపాలతో అలంకరించి లక్ష్మీ దేవిని పూజిస్తుంటారు. ఇక‌ పిల్లలకు సంబంధించి దీపావళి అనేది టపాకాయలు కాల్చుకునే పండగే. అయితే కరీంనగర్‌లో మాత్రం ఓ వింత‌.. విచిత్ర‌మైన ఆచారం ఉంది. అదేంటంటే స్మ‌శానం.. చుట్టూ సమాధులు… అక్కడే పిల్లలతో కలిసి దీపావళి వేడుకలు ఇదీ కరీంనగర్‌లో కనిపించే ఓ వింత‌ సాంప్రదాయం. చనిపోయిన తమ కుటుంబ సభ్యులను స్మరిస్తూ స్మశాన వాటికలోని వారి సమాధుల వద్ద ఇంటిళ్ల పాది దీపావళి వేడుకలు చేసుకుంటారు.

చనిపోపోయిన తమ వారి సమాధుల దగ్గర వారికి నైవేద్యాన్ని పెట్టి అక్కడే పిల్లాపాపలతో టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇలా జరుపుకోవడం కరీంనగర్‌లోని కొంత మందికి సంప్రదాయంగా వస్తుంది. కరీంనగర్ ఆదర్శనగర్‌లోని స్మశాన వాటికలో గత కొన్నేళ్లుగా దీపావళి పండుగను ఇలా స్థానికులు జరుపుకుంటున్నారు. ఇదీ కాస్త వింత గానే ఉన్నప్పటికీ చనిపోయిన వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటు పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందంటున్నారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Latest news