విషాదం : పాక్‌లో భారీ పేలుడు..40 మంది మృతి

-

నిత్యం ఏదో చోట పేలుడు, దాడులతో వార్తల్లో నిలిచే పాకిస్తాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. పాకిస్తాన్ లోని బజౌర్ లో ఆదివారం నాడు భారీ పేలుడుతో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఓ పొలిటికల్ పార్టీ మీటింగ్ లో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో 39 మంది మరణించగా.. 60 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఐదు అంబులెన్సుల్లో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నాయి. రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

Pakistan bomb blast death toll climbs to 35; over 150 injured | Deccan  Herald

ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనుండగా ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఖార్ పట్టణంలో సమావేశాన్ని నిర్వహిస్తున్న జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఎఫ్) పార్టీ లక్ష్యంగా పేలుడు జరిగిందని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్ తెలిపారు. పార్టీ నుండి ఒక సీనియర్ నాయకుడు వేడుకలో ప్రసంగించాల్సి ఉండగా.. అతను రాకముందే బాంబు పేలుడు జరిగిందని చెప్పారు. దాడికి పాల్పడిందెవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పాక్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news