విరాట్ కోహ్లీకి బ్రేస్‌లెట్ గిప్ట్‌గా ఇచ్చిన చిన్నారి.. వీడియో వైర‌ల్

-

ఇండియ్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు విరాట్ కు అభిమానులున్నారు. ఇక కేవలం ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు విరాట్ కు. అయితే తాజాగా కోహ్లీకి ఓ చిన్నారి అభిమానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. ఇంతకీ అదేంటంటే..

వెస్టిండిస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి 1-0తో ముందంజలో ఉన్న టీమ్‌ ఇండియా.. శనివారం జ‌రిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఓట‌మి పాల‌యిన విష‌యం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఒక చిన్నారి స్టేడియంలో నిలబడి కోహ్లీ.. కోహ్లీ.. అంటూ పిల‌వ‌గా.. కోహ్లీ ఆ చిన్నారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి చిన్నారిని, ఆమె కుటుంబాన్ని కలిశాడు. ఈ క్ర‌మంలో ఆ చిన్నారి కోహ్లీకి బ్రేస్‌లెట్ గిప్ట్‌గా ఇచ్చింది. ఆ బ్రేస్‌లెట్ ధ‌రించిన కోహ్లీ చిన్నారికి థాంక్యూ చెప్పాడు. అనంతరం ఆ ఫ్యామిలీకి ఆటోగ్రాఫ్ ఇచ్చి వాళ్లతో సెల్ఫీ దిగాడు.

Read more RELATED
Recommended to you

Latest news