నితిన్ దేశాయ్ సూసైడ్ కేసు.. ఆడియో క్లిప్స్‌ రికార్డ్‌లో బయటపడ్డ నిజం

-

అప్పుల బాధ తట్టుకోలేక బాలీవుడ్‌ ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న రాయ్‌గఢ్‌ పోలీసులు నితిన్‌కు చెందిన ఎన్డీ ఆర్ట్స్ స్టూడియో నుంచి ఓ ఆడియో రికార్డర్‌ స్వాధీనం చేసుకున్నామని.. అందులో దాదాపు 11 ఆడియో క్లిప్స్‌ ఉన్నాయని తెలిపారు. ఈ ఆడియో క్లిప్​లలో నితిన్ తన ఆవేదనను వెళ్లగక్కినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. అప్పుల భారంతో ఆయన విసిగిపోయినట్లు క్లిప్​లలో తెలుస్తోందని అన్నారు.

‘‘ఇప్పటికే ఎంతో దూరం వచ్చా. ఇక, నడిచే ఓపిక నాకు లేదు’’ అని బాధపడ్డారు. ఫైనాన్స్‌ సంస్థ విధానాల కారణంగా తాను అప్పుల ఊబిలో కూరుకుపోయానని.. వాటి నుంచి బయట పడలేకపోతున్నానన్నారు. అలాగే, తాను ఫైనాన్స్‌ తీసుకున్న సంస్థలోని నలుగురు వ్యక్తుల గురించి నితిన్‌ ఎక్కువగా మాట్లాడారు. త్వరలోనే ఆ నలుగురు వ్యక్తులను విచారిస్తాం’’ అని పోలీస్‌ అధికారులు తెలిపారు. మరికొన్ని ఆడియో క్లిప్స్‌లో నితిన్‌.. తన లైఫ్‌స్టోరీని చెప్పారని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news