ఏపీలో రాజకీయ కక్షలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ – టిడిపి నేతల మధ్య వైరం ఎక్కువవుతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రాజెక్టుల యుద్ధ భేరి కార్యక్రమం చిత్తూరు జిల్లాలో ప్రవేశించిన అనంతరం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పుంగనూరులో ఇరు పార్టీల వారు ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు రువ్వుకున్నారు. ఇక మూడు రోజుల క్రితం పులివెందులలో చంద్రబాబు తనను తక్కువ అంచనా వేయవద్దని అన్నారు.
తాను కొదమ సింహంలా అణచివేస్తానని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై శనివారం ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి. తోడేళ్లు, నక్కలు ఎప్పుడు సింహంలా మారినట్లు కలలు కంటూ ఉంటాయని.. సింహంలా గర్జించాలని చూస్తాయి కానీ ఎంత ప్రయత్నించినా అది జరగదు అన్నారు. విపక్ష నేతకు కూడా సింహంలా మారాలని ఆశ.. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడే కాలేకపోయాడు. ఇప్పుడు కొత్తగా సింహంలా ఎలా అవుతాడని ఎద్దేవా చేశారు.
తొడేళ్లు, నక్కలు ఎప్పుడూ సింహంగా మారినట్టు కలలు కంటుంటాయి. సింహంలా గర్జించాలని చూస్తాయి. కాని జన్మత: వచ్చిన ఊళ ఎంత ప్రయత్నించినా పోదు. విపక్షనేతకు కూడా సింహంలా మారాలని ఆశ. 14 ఏళ్లు సిఎంగా ఉన్నప్పుడే కాలేకపోయాడు. ఇప్పుడు కొత్తగా సింహం ఎలా అవుతాడు?
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 5, 2023