పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తమన్న.. ఇంకా ఆ కోరిక తీరలేదంటోంది

-

లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది మిల్క్ బ్యూటీ తమన్నా .. తెలుగుతోపాటు తమిళ , హిందీ భాషల్లో కూడా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ కు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హీరోయిన్‌ తమన్నా హాట్‌ కామెంట్స్‌ చేసింది.

విజయ్ వర్మతో ప్రేమ విషయాన్ని తానే బయట పెట్టానని, అలాగే పెళ్లి టైం వచ్చినప్పుడు స్వయంగా వెల్లడిస్తానని హీరోయిన్ తమన్నా స్పష్టం చేశారు. ప్రస్తుతం బిజీగా ఉన్నానని, పెళ్లి ప్రణాళికలు లేవని తెలిపారు. ఈనెల 10న జైలర్, 11న భోళాశంకర్ సినిమాల విడుదల నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 18 ఏళ్ల ప్రయాణంలో అగ్రహీరోలు, యువ నటులతో నటించానని చెప్పారు. ఎవరితో పనిచేసినా వారి వయస్సును ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news