ఆసక్తికరంగా.. మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ ట్రైలర్

-

యంగ్‌ హీరో సోహైల్‌, రూపా కొడవయూర్‌ హీరో హీరోయిన్లుగా మైక్‌ మూవీస్‌ బ్యానర్‌ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్‌ అన్నపరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ ప్రెగెంట్‌’. శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్షన్ లో మిస్టర్ ప్రెగ్నెంట్ అనే వెరైటీ టైటిల్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సొహైల్. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి కింగ్ నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు.ఓ మగవాడు గర్భం దాలిస్తే.. ఎలా ఉంటుందో అనే థీమ్ తో వస్తోన్న ఈ ట్రైలర్ కామిక్ యాంగిల్ తో పాటు, ఎమోషన్ టచ్ ఇస్తుంది. నా పేరు గౌతమ్.. నాది మంచి క్రేజీ లైఫ్.. ఓ క్రేజీ గర్ల్ ఫ్రెండ్ అంటూ స్టార్ట్ అయినా ఈ ట్రైలర్​లో..ఇది అందరి లైఫ్​లో ఉండేదే బ్రో..కానీ నా లైఫ్​లో ఓ ట్విస్ట్.. అంటూ సోహెల్ కథలోకి తీసుకెళ్లగా..నీకు కడుపొచ్చినా విషయం బయట తెలిస్తే .. కంపైపోతదిరా.. అంటూ వైవా హర్షా చెప్పే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Mister Pregnant Trailer Launch Event | Producer AppiReddy Speech | Nagarjuna | Sohel | Roopa | MicTv - YouTube

కాగా సోహెల్ ఎమోషనల్ టచ్ ను కూడా చూపెడుతూ.. మనం నవ్వితే బేబీ నవ్వుతూ ఉంటదిరా..ఏడిస్తే ఏడుస్తుంది రా అనే డైలాగ్ హత్తుకుంటోంది. దీంతో మూవీ టీమ్. సమాజానికి మెస్సేజ్ ఇవ్వడానికి కొత్త కాన్సెప్ట్ తో వస్తుందని అర్ధం అవుతోంది.ప్రెసెంట్ సోహెల్ ఈ మూవీతో పాటు మరో నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా మదర్స్ డే స్పెషల్ గా వచ్చిన ఫస్ట్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో అమ్మ గురించి సొహైల్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.. తొమ్మిది నెలల కష్టాన్ని నవ్వుతూ భరించి, ప్రాణాలకు తెగించి ఓ బిడ్డకు జన్మనిస్తారు. ఈ ఆడవాళ్లు గ్రేట్ సార్.. అంటూ సొహైల్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ సినిమాపై ఇంటరెస్ట్‌‌‌‌‌‌‌‌ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సోహెల్ కెరీర్ లో స్పెషల్ మూవీ గా ఉంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ తెలుపుతున్నారు.జార్జీ రెడ్డి, ప్రెషర్ కుక్కర్ వంటి మూవీస్ కు వర్క్ చేసిన టీమ్ ఈ మూవీకు వర్క్ చేయడం విశేషం.అలనాటి సుహాసిని మణిరత్నం, బ్రహ్మాజీ, రజా రవీంద్ర, అలీ, అభిషేక్ రెడ్డి, వైవా హర్ష, స్వప్నిక తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి, రవీరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి కలిసి సంయుక్తంగాఈ మూవీను నిర్మిస్తున్నారు. కాగా శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news