హస్తంలో బిగ్ లీడర్స్ జంపింగ్..బ్రేకులు పడ్డాయా?

-

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీలో భారీగా వలసలు కొనసాగుతున్నాయి. అయితే కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్న నేతల పేర్లు బయటకొచ్చాయి..కానీ ఆ నేతలు ఎవరూ కాంగ్రెస్ లో చేరలేదు. ఇటీవల కాలంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మినహా మిగతా పెద్ద నేతలు ఎవరు చేరలేదు.

అయితే చేరికలపై పెద్ద ఎత్తున కథనాలు మాత్రం వచ్చాయి. మరి ఎందుకు కీలక నేతల చేరికలు ఆగిపోయాయనేది క్లారిటీ రావడం లేదు. ఆ మధ్య ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, వేముల వీరేశం, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి,..చివరిగా వైఎస్ షర్మిల సైతం కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రచారం వచ్చింది. ఇప్పటికే షర్మిల..వైఎస్సార్టీపీ..కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని తేలింది.

కానీ ఇంతవరకు ఆమె చేరికపై క్లారిటీ రాలేదు. కాకపోతే ఆమె రాజకీయంగా కూడా యాక్టివ్ గా లేరు. ఏదో సోషల్ మీడియాలో పోస్టులు మాత్రమే పెడుతున్నారు. ఇటు మిగతా నేతల సంగతి కూడా క్లారిటీ లేదు. ఈటల, కోమటిరెడ్డి బి‌జే‌పిలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ లో ఈ నేతలు చేరే అవకాశం ఉందా? లేదా? అనేది తెలియడం లేదు. ఈ చేరికలు గాని అయ్యి ఉంటే కాంగ్రెస్‌కు మరింత ఊపు వచ్చేది.

అయితే ఇలా నేతలంతా వలస వస్తే..ముందు నుంచి పార్టీలో ఉన్న నేతలకు ఇబ్బంది అవుతుందని, అందుకే  కొందరు సీనియర్లు ఈ వలసలకు బ్రేకులు వేశారనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి చూడాలి ఎన్నికల ముందు వలసలు పెరుగుతాయేమో.

Read more RELATED
Recommended to you

Latest news