కాంగ్రెస్‌, UPA స్కామ్​లపై అమిత్​ షా లెక్కలివీ

-

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండ్రోజులుగా వాడీవేడిగా చర్చ జరుగుతోంది. బుధవారం రోజున ఈ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడారు. అనంతరం అమిత్‌ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, యూపీయేల హయాంలోని కుంభకోణాలను చదివి వినిపించారు. షా చెప్పిన కుంభకోణాలు ఏంటంటే.. బోఫోర్స్‌, 2జీ స్కాం, సత్యం, కామన్‌వెల్త్‌, బొగ్గు, టాటా ట్రక్‌, ఓటుకు నోటు, ఆదర్శ్‌, నేషనల్‌ హెరాల్డ్‌, వాద్రా డీఎల్‌ఎఫ్‌, దాణా, ఆహార భద్రత బిల్లు, గాజియాబాద్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, హర్షద్‌ మెహతా షేర్‌ బజార్‌, హసన్‌ అలీ హవాలా, ఐపీఎల్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, మధు కోడా, సబ్‌మెరైన్‌.

అనంతరం అమిత్ షా కాంగ్రెస్‌ హయాంలో అల్లర్ల లిస్టు కూడా చెప్పారు. అవేంటంటే.. ‘అస్సాం- 1983 ఫిబ్రవరి 15 నుంచి 27 మార్చి వరకూ జరిగిన అల్లర్లలో 750 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌- 1990 డిసెంబరు 6 నుంచి జరిగిన అల్లర్లలో హైదరాబాద్‌లో 143 మంది.. ఉత్తర్‌ప్రదేశ్‌- మొరాదాబాద్‌లో 1980 ఆగస్టు 13 నుంచి జరిగిన అల్లర్లలో రెండు రోజుల్లో వెయ్యి మంది బలయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌- మేరఠ్‌లో 1927 మే 18 నుంచి జులై 23వరకూ జరిగిన అల్లర్లలో 187 మంది… ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో జరిగిన అల్లర్లలో 112 మంది.. గుజరాత్‌- 1985 ఫిబ్రవరి 18 నుంచి జులై 23వరకూ జరిగిన అర్లర్లలో 206 మంది.. ఝార్ఖండ్‌- 1967లో 183 మంది.. పశ్చిమ బెంగాల్‌- 1964 మార్చి 16న జరిగిన అల్లర్లలో వెయ్యి మందికిపైగా.. 9. బిహార్‌- జంషెడ్‌పుర్‌లో 120 మంది చనిపోయారు.’ అని షా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news