బీఆర్ఎస్పై మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండ సంజయ్ ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏలా తెలంగాణలో అవినీతి చేసిన టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్గా మారిందన్నారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన ఆవేశంగా, ఉద్వేగంగా మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత పేరు కాశీమ్ చంద్రశేఖర్ రజ్వీ అంటూ విమర్శలు గుప్పించారు బండి సంజయ్. బెంగాల్ దీదీ, ఢిల్లీ కేజ్రీ, ఇక్కడి కాంగీ, తెలంగాణ కేడీ అవిశ్వాసం ఎందుకు పెట్టారని బండి సంజయ్ నిలదీశారు. తెలంగాణలో 1400 మందిని బలి తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మీరు తెలంగాణ ఇవ్వకుంటే మేం అధికారంలోకి వచ్చాక ఇస్తామని నాడు సుష్మాస్వరాజ్ చెబితే, ఆ తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. మోడీ హయాంలో శక్తివంతమైన భారత నిర్మాణం జరుగుతోందన్నారు బండి సంజయ్.
కేసీఆర్ తన పాలనలో తెలంగాణ ప్రజలను, రైతులను నాశనం చేశారన్నారు. బీఆర్ఎస్కు తెలిసింది ఏమంటే రాత్రంతా తాగడం, ఉదయం పడుకోవడం, ఎవరినీ కలవకపోవడమని ఎద్దేవా చేశారు. ఈ తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్, ఆయన కుటుంబ ఆస్తులు భారీగా పెరిగాయన్నారు. కానీ ప్రజలు మాత్రం అప్పుల్లో కూరుకుపోయారన్నారు. కేసీఆర్ వ్యవసాయం ద్వారా ఎకరాకు రూ.1 కోటి సంపాదిస్తున్నారని, కేసీఆర్ కొడుకు ఆస్తులు 400 రెట్లు పెరిగాయని నిప్పులు చెరిగారు బండి సంజయ్. కేసీఆర్ అవిశ్వాసానికి ఎందుకు మద్దతిచ్చారో చెప్పాలన్నారు బండి సంజయ్. తెలంగాణలో కేసీఆర్ పాలనలో ప్రజల్ని మోసం చేశారన్నారు. అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. మిషన్ భగీరథ పేరుతో, కేంద్రం ఇచ్చిన డబ్బులను ప్రజలకు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. బీఆర్ఎస్ దొంగలు బియ్యాన్ని కూడా అమ్ముకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను దోచుకుంటోందన్నారు. మోదీ మణిపూర్ పోలేదంటున్నారని, కానీ రైతులు, యువత, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి లేదన్నారు. గత పలు ఎన్నికల్లో చాలాచోట్ల కనీసం డిపాజిట్ రాలేదన్నారు బండి సంజయ్.