కాపురం కోసం జగన్ నిర్మించుకున్న ఇంటిని కూల్చాల్సిందే – వైసీపీ ఎంపీ సంచలనం

-

టూరిజం కాటేజీల ముసుగులో కాపురం కోసం ముఖ్యమంత్రి జగన్ కట్టుకున్న భవనాన్ని కూల్చాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణ రాజు. తిరుమల, శ్రీశైలం గుట్టలు సముద్రానికి దగ్గరగా లేవని, సముద్ర మట్టానికి 150 నుంచి 250 మీటర్ల పరిధిలో సి ఆర్ జెడ్ జోన్ నిబంధనలు ఉంటాయని, రిషికొండపై టూరిజం కాటేజీల ముసుగులో జగన్ మోహన్ రెడ్డి గారు నిర్మించిన అక్రమ భవనం సి ఆర్ జెడ్ జోన్ పరిధిలోకి వస్తుందన్నారు. సి ఆర్ జెడ్ జోన్ లో కొన్ని నిబంధనలు ఉంటాయన్న అవగాహన కూడా లేకుండా మాట్లాడిన ఇద్దరు మంత్రులు జ్ఞాన శూన్యులేనని అర్థమవుతోందని అన్నారు.

ముఖ్యమంత్రి గారు టూరిజం కాటేజీల ముసుగులో కొత్త కాపురం కోసం నిర్మించుకున్న భవనాన్ని కూడా కూల్చివేయాలని రఘురామకృష్ణ రాజు గారు కోరారు. కూల్చివేసే బాధ్యతను రేపు నూతనంగా ఏర్పడనున్న ప్రభుత్వం తీసుకోవాలని, ఈ భవన సముదాయ నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా చెబుతున్నారని, ఈ పాలకుల వల్ల ప్రజలు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారని, పనికిమాలిన పాలకులకు గుణపాఠం రావాలంటే, ఈ తరహా అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందేనని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు. రిషికొండ అక్రమ నిర్మాణంపై తన ప్రస్తుత పార్టీ అధికారిక వెబ్సైట్లో ఒక ట్వీట్ చేశారని, రిషి కొండపై సెక్రటేరియట్, సెక్రటరీల భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారని, ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలు కడితే తప్పా అని ప్రశ్నించిన కొద్దిసేపటికే, ఆ ట్వీట్ ను తొలగించారని, కోర్టు ధిక్కరణ కింద అడ్డంగా దొరికిపోతామనే ఆ ట్విట్ తొలగించి వేశారని, ఆ తరువాత తమ వంది మాగాదులను రంగంలోకి దింపి, వారి చేత నోటికొచ్చినట్లు మాట్లాడించారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news