భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రిటన్ లోని కేంబ్రిడ్జీ యూనివర్సిటీ జీసస్ కాలేజీలో ఏర్పాటు చేసిన రామకథ ప్రవచనం కార్యక్రమానకిి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధ్యాత్మిక గురువు మురారీ బాపు ఏర్పాటు చేసిన రామ కథ వినేందుకు ఆయన వెళ్లారు. సునాక్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇక్కడికి ప్రధాని రాలేదని.. ఓ హిందువుగా వచ్చనని తెలిపారు.
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తొలి శ్వేత జాతీయేతర వ్యక్తిగా రికార్డు సృష్టించిన విషయం విధితమే. గతంలో పలు సందర్భాలలో తాను హిందువుని అని బహిరంగంగానే ప్రకటించారు.ఇదే సమయంలో ప్రవచనం వేదికపై బాపు మురారీ ఆసనం వెనుక ఏర్పాటు చేసిన హనుమంతుడి పోస్టర్ ప్రస్తావించారు రిషి సునాక్. తన అధికారిక కార్యాలయంలోని టేబుల్ పై కూడా గణేశుడి విగ్రహం ఉంటుందని తెలిపారు. తనకు రాముడు ఎప్పుడూ స్ఫూర్తి అని చెప్పారు. భగవద్గీత, హనుమాన్ చాలీసా స్మరించుకుంటూ ఇక్కడికి బయలుదేరాను అని చెప్పారు.