బాలీవుడ్‌లో షారుక్ చేసే రాజకీయాలు నచ్చవు.. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కామెంట్స్

-

బాలీవుడ్‌ స్టార్ హీరో షారుక్ ఖాన్ పై ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సంచలన కామెంట్స్ చేశారు. తనకు షారుక్ అంటే ఇష్టమని చెబుతూనే.. ఆయన చేసే కొన్ని పనులు అస్సలు నచ్చవని అన్నారు. ఇంకా ఆయన ఈ స్టార్ హీరో గురించి ఏం అన్నారంటే..

‘‘నేను షారుక్‌కు ఫ్యాన్. ఆయనకు ఉన్నంత చరిష్మా సినీ పరిశ్రమలో మరే నటుడికీ లేదు. కానీ, నాకు ఆయన చేసే రాజకీయాలు నచ్చవు. ఇలాంటి హీరోల వల్లే బాలీవుడ్‌కు చెడ్డ పేరు వస్తుందని నా అభిప్రాయం. ఇలాంటి వాళ్లు స్టార్‌డమ్‌ లేకుండా దేన్నీ అంగీకరించరు. అలాగే నాకు షారుక్‌తో ఉన్న రెండో అతి పెద్ద సమస్య ఏంటంటే.. ప్రేక్షకులకు ఏమీ తెలియదని ఆయన భావిస్తారు. ఈ విషయాన్ని నేను భరించలేను. మా ఇద్దరిదీ భిన్న వైఖరి. అయినా షారుక్‌ అంటే నాకు చాలా ఇష్టం.’’ అని వివేక్‌ అగ్ని హోత్రి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news