సిరిసిల్ల అంటేనే గీతన్న, నేతన్న : మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

సిరిసిల్ల అంటేనే గీతన్న, నేతన్న.. ఉదయం కష్టపడే నేతన్న సాయంత్రం గీతన్నను కలుస్తాడు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఇవాళ సర్వాయి పాపన్న వర్థంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ తో కలిసి ఆయన సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..  దేవుడు తాగే అమృతం ను గీతన్న అందిస్తున్నాడని..నేతన్న పని చేసి కష్టపడి ఆకలి తో  అలమటించి ఆనాడు చనిపోయారని గుర్తు చేశారు.

గీతన్న లు కూడ ప్రమాదవాత్తూ చాలా మంది చనిపోయారని తెలిపారు. కల్లు అన్ని రకాలుగా ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది..తాటి ముంజలలో కాల్షియం ఉంటుందని.. అంటరానితనం ఉన్నప్పుడు కూడ గౌడ కులస్తుల వద్ద ఎలాంటి కులం లేదు అన్నారు.  తాగే వద్ద ఎలాంటి కులం ఉండదు అని.. తెలంగాణ రాక ముందు ఎలా ఉండేది గౌడ కులస్తులే ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు. గౌడ కులస్తులకు సెల్ఫ్ రెస్పెక్ట్  బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని.. మేము ఇచ్చే నీరా ను బెంజ్ కారులో వచ్చి తాగుతున్నారు.

తొమ్మిదేళ్లలో గౌడ కులస్తులు ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందారని తెలిపారు.  70 వేల మంది గీత కార్మికులను పెన్షన్ ఇస్తున్నారు అని.. వైన్స్ టెండర్ లలో రిజర్వేషన్ కల్పించారు. దాదాపు రూ.500 కోట్ల విలువైన భూమిని గౌడ కులస్తులకు హైదరాబాద్ లో ఇచ్చారు. తెలంగాణ వచ్చాక సిరిసిల్ల అభివృద్ధి చెందింది. కరీంనగర్ జిల్లా అంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఇచ్చిందని తెలిపారు. కేటీఆర్ కి సిరిసిల్ల కి పేగు బంధం ఉందన్నారు. సిరిసిల్ల లో కేటీఆర్  ఉండడం సిరిసిల్ల ప్రజల అదృష్టం అనిమంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news