రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఆపాలంటే అదొక్కటే మార్గం : వివేక్ రామస్వామి

-

అమెరికా దేశాధ్యక్ష ఎన్నిక‌ల్లో భారత్‌కు చెందిన వివేక్ రామ‌స్వామి రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున పోటీప‌డేందుకు ఆస‌క్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్ధిత్వం కోసం ఆయ‌న ప్రచారం కూడా షురూ చేశారు. ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులు ఆయనకు మద్దతు కూడా పలుకుతున్నారు. తాజాగా టెస్లా అధినేత కూడా ఆయన గురించి పాజిటివ్​గా ప్రచారం చేస్తూ.. సపోర్ట్ ఇస్తున్నారు.

ప్రచారంలో భాగంగా వివేక్.. మీడియా ఇంటర్వ్యూలు, చర్చా వేదికలపై వివిధ అంశాల గురించి తన ఆలోచనలను పంచుకుంటున్నారు. ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ (CNN) టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం పై మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఆపాలంటే ముందు చైనాతో పుతిన్ దోస్తీని కట్ చేయాలని అభిప్రాయపడ్డారు. ఆ పని తాను చేయగలనని చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మాస్కోలో పర్యటించి.. చైనాతో దోస్తీని వదులుకునేలా పుతిన్‌కు ఒప్పిస్తానని వ్యాఖ్యానించారు వివేక్. తన విదేశీ విధానాల్లో ఇదే ప్రథమమైనది చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news