‘గుంటూరు కారం’ రూమర్స్​కు చెక్ పెట్టిన మహేశ్ బాబు

-

సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. హైదరాబాద్​లో ఓ ఈవెంట్​లో పాల్గొన్న ఈ స్టార్ హీరో.. విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. కచ్చితంగా గుంటూరు కారం సంక్రాంతికే వస్తుందని చెప్పాడు. ఈ హీరో క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఇటీవలే ఈ చిత్రబృందంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో అసలు ఈ సినిమా సరిగ్గా పట్టాలెక్కుతుందా.. షూటింగ్ పూర్తైనా.. సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అన్న అనుమానం ఫ్యాన్స్​లో నెలకొంది. ఇప్పుడు మహేశ్ బాబు ఇచ్చిన స్టేట్​మెంట్ ఆ సందేహాలన్నీ పటాపంచలు చేసేసింది.

అయితే కొంతకాలంగా గుంటూరు కారం టీమ్​కు అసలు కలిసి రావడం లేదు. మొదట హీరోయిన్​ పూజా హెగ్డే.. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఇక ఇటీవల ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్.. ఇలా ఒకరి వెంట మరొకరు ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు. మరోవైపు మహేశ్ బాబు గంపగుత్తగా ఒకటి తర్వాత మరో సినిమా ప్రకటించేస్తున్నాడు. ఇదంతా మహేశ్ ఫ్యాన్స్​ను గందరగోళానికి గురి చేసింది. ఇది చాలదన్నట్లు గుంటూరు కారం పోస్ట్ పోన్ అంటూ ట్విటర్​లో హ్యాష్​ట్యాగ్​లు తెగ ట్రెండ్ అవ్వడంతో ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. ఇక మహేశ్ ఇచ్చిన క్లారిటీతో ఇప్పుడు వాళ్లంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news