‘అమావాస్య నాడు క్రైమ్స్ ఎక్కువ.. బీ అలర్ట్’.. పోలీసులకు పంచాంగం పంపిన DGP

-

ఉత్తర్​ప్రదేశ్​లో నేరాలను అరికట్టేందుకు ఆ రాష్ట్ర పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక ఆ రాష్ట్ర డీజీపీ.. తన టీమ్​ను నిరంతరం అప్రమత్తం చేస్తూ నేరాలు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఆ రాష్ట్ర పోలీసులకు ఓ లేఖను పంపారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ లెటర్​ చూసి భేష్ అని కొందరు అంటుంటే.. ఇదేం పైత్యం అని మరికొందరు మండిపడుతున్నారు. ఇంతకీ ఆ లేఖలో ఏం ఉందంటే..?

యూపీ డీజీపీ విజయ్ కుమార్ పోలీస్​ ఉన్నతాధికారులకు సుదీర్ఘ లేఖను పంపారు. అందులో హత్య, దోపిడీ, దొంగతనం వంటి ఘటనలను అరికట్టాలని.. రాత్రి సమయంలో జరిగే నేరాలను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు. ఆ లేఖతో పాటు హిందూ పంచాంగాన్ని కూడా పంపారు.

హిందూ పంచాంగం సాయంతో.. అమావాస్యకు ఒక వారం ముందు.. ఒక వారం తర్వాత జరిగే నేరాలను అరికట్టడానికి పెట్రోలింగ్ చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో జరిగిన ఘటనలను విశ్లేషించిన తర్వాత ఈ లేఖ రాసినట్లు డీజీపీ విజయ్​కుమార్​ తెలిపారు. హిందూ పంచాంగంలోని అమావాస్య (కృష్ణ పక్షం)కు ఒక వారం ముందు.. ఒక వారం తర్వాత నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించినట్లు ఆయన వివరించారు. ఆ తేదీల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news