మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎన్నికల అఫీడవిట్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసులు పెట్టాలని గతంలో ఆదేశించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జ్ జయకుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీం కోర్ట్.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా పదిమందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించిన జడ్జ్ జయకుమార్ తీర్పుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మసనం. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల వ్యవస్థలపై కేసులు పెట్టాలని ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించింది. అసలు కేసు ఏంటంటే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ఆఫిడవిట్ లో తప్పుడు వివరాలు పేర్కొని టాంపరింగ్ కి పాల్పడ్డారు అనే ఫిర్యాదు పై మహబూబ్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో ఎన్నికల అఫీడవిట్ టాంపరింగ్ కి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో పదిమంది అధికారులపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ధర్మాసనం పై విధంగా తీర్పునిచ్చింది.